ఈద్‌ కానుకగా ‘రాధే’లోని మూడో పాట విడుదల

26 May, 2020 17:23 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తన మాట నిలబెట్టుకున్నాడు. ఎప్పటిలాగే ఈ రంజాన్‌కు తన తాజా సినిమా ‘రాధే’ను భాయిజాన్‌ విడుదల చేయాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఈ క్రమంలో భాయిజాన్‌ ‘రాధే’లోని భాయ్ అంటూ సాగే పాటను సోమవారం సాయంత్రం విడుదల చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలైన విషయం తెలిసిందే. అభిమానులకు ఈద్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ‘రాధే’లోని మూడో​ పాటను భాయిజాన్‌ విడుదల చేశాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో ప్రకటిస్తూ.. ‘మొదట అందరికి ఈద్‌ ముబారక్‌. ఈ ఏడాది మహమ్మారిని ఎదుర్కోవటానికి మనందరికి బలం చేకూరాలని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశాడు. (అయ్యో ఈ సారి భాయిజాన్‌ సినిమా లేదే!)

అంతేగాక ‘‘ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది ఈద్‌‌కు నా సినిమాను విడుదల చేయలేకపోయాము. కాబట్టి నా ప్రియమైన అభిమానులందరి కోసం ఈ పాటను ప్రత్యేకంగా రూపోందించాం. మనమంతా సోదర భావం, ఐక్యతగా ఉండాలనే భావనతో భాయ్ అని పిలుచుకుంటాము. దీనికి గుర్తింపుగా ‘భాయ్‌ భాయ్’ పాటను ఈద్‌ ప్రత్యేక రోజును ఉత్తమంగా భావించి విడుదల చేశాం. దీనిని మీరంతా తప్పకుండా ఆనందిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. కాగా భాయిజాన్‌ గత కొన్నేళ్లుగా ప్రతి రంజాన్‌కు తన కొత్త సినిమాను విడుదల చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా విడుదలైన భాయిజాన్‌ సినిమాలన్ని ఘన విజయం సాధించి భారీ కలెక్షన్‌లను రాబట్టాయి. అదే విధంగా 2020 ఈద్‌కు కూడా తన ‘రాధే సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్)

మరిన్ని వార్తలు