సల్మాన్ ‘తేరే బినా’ టీజర్‌ విడుదల

10 May, 2020 15:05 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మదర్స్‌ డే సందర్భంగా తాను నటించిన ‘తేరే బినా’ మ్యూజిక్‌ వీడియో టీజర్‌ను ట్వీటర్‌లో విడుదల చేశారు. ‘తేరే బినా.. హ్యాపీ మదర్స్‌ డే’ అని సల్మాన్‌ కామెంట్‌ జతచేశారు. ఇక ఈ మ్యూజిక్‌ వీడియో టీజర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేస్తానని ఇటీవల సల్మాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సల్మాన్‌కు జంటగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాక్వలిన్‌ ఫెర్నాండేజ్  నటించారు. సల్మాన్‌ గుర్రంపై స్వారీ చేస్తున్న షాట్‌తో టీజర్‌ మొదలవుతుంది.

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌లో భాగంగా సల్మాన్‌ పన్వెల్ ఫామ్‌హౌస్‌కి పరిమితమైన విషయం తెలిసిందే. హీరోయిన్‌ జాక్వలిన్‌ కూడా సల్మాన్‌ ఫామ్‌లో స్వీయ నిర్భందంలో ఉన్నారు. లాక్‌డౌన్‌లో వేళ సల్మాన్‌, జాక్వలిన్‌ సోషల్ ‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ ‘తేరే బినా’ మ్యూజిక్‌ వీడియో టీజర్‌ సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు