బావా.. ఆల్ ది బెస్ట్: సల్మాన్ ఖాన్

9 Oct, 2017 23:08 IST|Sakshi

సాక్షి, ముంబయి: బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న తన బావకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కండలవీరుడి చిన్న సోదరి అర్పితా ఖాన్‌ భర్త ఆయుష్‌ శర్మ ‘సల్మాన్‌ ఖాన్‌ ఫిలిమ్స్‌’ ప్రొడక్షన్‌ పై తెరకెక్కుతున్న నూతన చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. ఈ నేపథ్యంలో 'ఆయుష్‌ శర్మ నీకు శుభాకాంక్షలు, ఇక మీదట నీ కృషి, పట్టుదలే నిన్ను పైకి తీసుకొస్తాయని' పేర్కొంటూ సల్మాన్‌ ట్వీట్‌ చేశారు. ఆల్ ది బెస్ట్ బావా అంటూ సల్మాన్ చేసిన ట్వీట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
    
అభిరాజ్‌ మిన్వాలే దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ద్వారా ఆయుష్‌ శర్మ బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. గుజరాత్‌ నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా.. దర్శకుడు అభిరాజ్‌కు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌, ఆయుష్‌ శర్మల వివాహం 2014లో హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వారం పాటు జరిగిన ఈ భారీ వేడుకకు నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ వేదికైంది. ఆయుష్‌, అర్పితా దంపతులకు ఏడాదిన్నర కుమారుడు ఆహిల్‌ ఉన్నాడు.

మరిన్ని వార్తలు