ఆ అవార్డును మాత్రమే తీసుకుంటా: సల్మాన్‌

17 Feb, 2020 17:19 IST|Sakshi

ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్‌ ఆవార్డుల కార్యక్రమం అస్సాంలోని గువాహటిలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రతిభ వంతులను కాదని.. అనర్హులకు 65వ ఫిలింఫేర్‌ అవార్డులు ఇచ్చారంటూ సోషల్‌ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బైకాట్‌ ఫిలింఫేర్‌ అవార్డ్స్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ గతంలో ఫిలింఫేర్‌ అవార్డులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాను ఫిలింఫేర్‌ అవార్డును తీసుకోనని సల్మాన్‌ ఖాన్‌ అందులో పేర్కొన్నాడు. ఈ వీడియోకు అభిమానుల నుంచి ప్రశంసలు వస్తుంటే మరికొందరి నుంచి విమర్శలు వస్తున్నాయి. 

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులపై మండిపడ్డ రంగోలీ

‘ఎవరికైతే వారిపై వారికి నమ్మకం ఉండదో అలాంటి వారు మాత్రమే అవార్డులను ఆశిస్తారని నా అభిప్రాయం. కానీ.. నేను ఫలింఫేర్‌, ఇతర ఎలాంటి పిచ్చి ఆవార్డులను తీసుకోను. కేవలం గౌరవప్రదమైన జాతీయ అవార్డును మాత్రమే ఆశిస్తాను. దాన్ని మాత్రమే తీసుకుంటాను’ అని చెప్పాడు. దీంతో భాయిజాన్‌ వీడియోకు అభిమానులు ‘మీకు మా అభినందలు సల్మాన్‌ జీ’ అంటూ ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుంటే మరి కొంతమంది.. ‘మరీ డబ్బుల కోసం ఈ అవార్డుల కార్యాక్రమాలకు హాజరవుతున్నారు కదా!, అదే విధంగా ఈ ఫంక్షన్స్‌కు హాజరై డ్యాన్స్‌లు ఎందుకు చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

'గల్లీ బాయ్‌'కి అవార్డుల పంట

ఇక ఈ ఏడాది ఫిలింఫేర్‌ అవార్డుల్లో బాలీవుడ్‌ రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌లు నటించిన ‘గల్లీబాయ్‌’ చ్రితానికి అవార్డుల పంట పండింది. ఈ ఒక్క సినిమాకే పలు విభాగాల్లో మొత్తం 13 అవార్డులు వచ్చాయి. కాగా ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియాను ఫిలింఫేర్‌ వరించింది. అదే విధంగా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఈయర్‌ 2’కు గాను బెస్ట్‌ డెబ్యూ నటి అవార్డు అనన్య పాండేకు లభించింది. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’, హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలకు ఏ కేటగిరీలోనూ ఒక్క అవార్డ్ కూడా దక్కకపోవడం గమనార్హం. దీంతో  ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు