ఫలక్నుమా ప్యాలెస్ లో హీరో సోదరి పెళ్లి

6 Sep, 2014 14:10 IST|Sakshi
ఫలక్నుమా ప్యాలెస్ లో హీరో సోదరి పెళ్లి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం హైదరాబాద్లో జరగనుంది. ప్రతిష్టాత్మక తాజ్ ఫలక్‌ నుమా ప్యాలస్ ఈ వివాహ వేడుకకు వేదిక కానుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్  ధ్రువీకరించారు.  అర్పిత వివాహం ఏడాది జనవరిలో జరగనుంది.  అయితే వివాహ తేదీని ఇంకా ఖరారు చేయలేదని సలీమ్ ఖాన్ తెలిపారు. 'మేము చాలా కూల్గా వివాహ వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. అందుకు ఫలక్నూమా ప్యాలెస్ ను వేదికగా ఎన్నుకున్నాం. ఇటీవలి కాలంలో హైదరాబాద్ రాలేదు. ఫలక్నూమా వండర్ఫుల్ వెన్యూ కావటంతో అందరం అంగీకరించాం' అని సలీమ్ ఖాన్ పేర్కొన్నారు.

సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పిత... ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మ లవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు వీరిద్దరి ప్రేమకు ఆమోదం తెలపటంతో  పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.  వీరి పెళ్లిని ముస్లిం, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పెళ్లికూతురుతో పాటు సల్మాన్ కుటుంబ సభ్యులు ...ఫలక్ నూమా ప్యాలెస్ను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు సమాచారం. కాగా అత్యంత ఆర్భాటంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు జరిపించే సంపన్నులు ఈ మధ్య కాలంలో ఫలక్ నుమా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకోవటం విశేషం.