మోస్ట్‌ వాంటెడ్‌

12 Oct, 2019 00:32 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌ను గాడిలో పడేసిన సినిమా ‘వాంటెడ్‌’. ప్రభుదేవా దర్శకత్వంలో ‘పోకిరి’ చిత్రానికి హిందీ రీమేక్‌గా రూపొందింది ఈ సినిమా. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ‘మోస్ట్‌ వాంటెడ్‌’ అనే చిత్రం తెరకెక్కనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ నటించనున్న కొత్త సినిమాకు ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ కాప్‌: రాధే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్‌ పండగకు తీసుకురాబోతున్నారు. కొరియన్‌ చిత్రం ‘ద అవుట్‌ లాస్‌’ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. నవంబర్‌ 4న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. సల్మాన్‌ఖాన్‌ – ప్రభుదేవా కాంబినేషన్‌లోనే రెడీ అయిన ‘దబాంగ్‌ 3’ చిత్రం డిసెంబర్‌లో విడుదలకానుంది.

మరిన్ని వార్తలు