డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌

8 Feb, 2018 01:01 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్

యస్‌.. డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌. మరోసారి డెవిల్‌గా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు థియేటర్స్‌లో డబుల్‌ కిక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్‌ ఖాన్‌. ఆల్మోస్ట్‌ నాలుగేళ్ల క్రితం సాజిద్‌ నాడియాడ్‌వాలా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘కిక్‌’. తెలుగులో రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది.

హిందీ చిత్రంలో సల్మాన్‌ ఖాన్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రణ్‌దీప్‌ హుడా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించారు. దేవీలాల్‌ సింగ్‌ (డెవిల్‌) పాత్రలో సల్మాన్‌ నటించి, బాక్సాఫీసును కొల్లగొట్టారు. అంతేకాదు దర్శకత్వం వహించిన తొలి సినిమానే 200 కోట్ల క్లబ్‌లో చే ర్చిన ఘనత సాజిద్‌కు దక్కింది. బుధవారం ‘కిక్‌’కి సీక్వెల్‌గా ‘కిక్‌ 2’ చిత్రాన్ని ఎనౌన్స్‌ చేశారాయన. ‘‘వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌. ‘కిక్‌ 2’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయనున్నాం’’ అని పేర్కొన్నారు సాజిద్‌.

ఇందులో సల్మాన్‌ డ్యూయెల్‌ రోల్‌ చేయనున్నారన్న వార్తలు బీటౌన్‌లో జోరందుకున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది తన ఫేవరెట్‌ ఫెస్టివల్‌ రంజాన్‌కు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భరత్‌’ మూవీకి రెడీ అవుతున్నారు సల్మాన్‌. ఈ ఏడాది రంజాన్‌కు సల్మాన్‌ ‘రేస్‌ 3’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రిస్మస్‌కు సల్మాన్‌ ౖ‘టెగర్‌ జిందాహై’ చిత్రం రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. సో.. ఈ సెంటిమెంట్‌ను కొనసాగించడానికే సల్మాన్‌ వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ‘కిక్‌ 2’ ప్లాన్‌ చేశారని బాలీవుడ్‌ టాక్‌.

మరిన్ని వార్తలు