మేకప్‌కే రెండున్నర గంటలు

13 May, 2019 03:27 IST|Sakshi

సాధారణంగా సినిమా నిడివి రెండు నుంచి మూడు గంటల మధ్యలో ఉంటుంది. కానీ సినిమాలో ఒక్కో సీన్‌లో కనిపించే గెటప్‌ కోసం సుమారు రెండు గంటలు మేకప్‌ రూమ్‌లో గడిపారట సల్మాన్‌. తన తాజా చిత్రం ‘భారత్‌’లో 18 ఏళ్ల వయసు నుంచి 71 ఏళ్ల వృద్ధుడిగా విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారాయన. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్, కత్రీనా కైఫ్, దిశా పాట్నీ నటించిన చిత్రం ‘భారత్‌’.

ఈ సినిమాలో సల్మాన్‌ గెటప్స్‌ గురించి అలీ అబ్బాస్‌ జాఫర్‌ మాట్లాడుతూ– ‘‘ 70 ఏళ్ల వ్యక్తి పాత్ర కోసం యూకే కంపెనీ వాళ్లు వర్క్‌ చేశారు. ఈ పాత్రకు ఏ లుక్‌ సూట్‌ అవుతుందా? అని చాలా ట్రై చేశాం. 20 రకాలు గడ్డాలు, మీసాలు చూశాం. ఫైనల్‌గా ఇప్పుడు పోస్టర్స్‌లో చూస్తున్న లుక్‌ ఓకే అయింది. ప్రోస్థటిక్‌ మేకప్‌ కోసం రెండున్నర గంటలు సమయం తీసుకునేవారు. స్క్రిప్ట్‌లో ఈ లుక్స్‌ అవసరాన్ని సల్మాన్‌ అర్థం చేసుకొని చాలా సపోర్ట్‌ చేశారు’’ అన్నారు. ‘భారత్‌’ జూన్‌ 5న విడుదలవుతోంది.

మరిన్ని వార్తలు