యాక్షన్ మోడ్ లో సల్మాన్, కత్రినా

25 Oct, 2017 13:55 IST|Sakshi

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ఏక్తా టైగర్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్. తొలి భాగంలో సల్మాన్ భారత రా ఏజెంట్ గా, కత్రినా పాకిస్తాన్ ఐఎస్ ఐ ఏజెంట్ గా నటించారు.

సీక్వల్ లో వారి పాత్రలో ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఫస్ట్ పార్ట్ కు మించి యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయని తెలుస్తోంది. తాజా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా యాక్షన్ కు సంబంధించిన సీన్స్ తోనే డిజైన్ చేయటంతో సినిమా మీద అంచానలు భారీగా పెరిగిపోతున్నాయి. గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో టైగర్ జిందాహైతో బిగ్ హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు సల్లూ భాయ్.

మరిన్ని వార్తలు