తండ్రిని కాలేక పోయాను: సల్మాన్‌

28 Dec, 2019 15:53 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నిన్ననే 54వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. సల్లూ భాయ్‌ బర్త్‌డే విషేస్‌తో సోషల్‌ మీడియా హోరెత్తింది. ఇక సల్మాన్‌ పుట్టిన రోజునే సోదరి అర్పితా ఖాన్‌ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బర్త్‌డే రోజున అన్నయ్యకు చెల్లెలు అర్పితా కోడలిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ క్రమంలో సోదరి కూతరు అయత్‌ను చూడటానికి సల్మాన్‌ కుటుంబ సమేతంగా.. తల్లిదండ్రులు సలీమ్‌-సల్మా. సోదరుడు సోహైల్‌ ఖాన్‌తోకలిసి ముంబైలోని హిందుజా హస్పిటల్‌కు వెళ్లారు. ఈ ప్రయాణంలో సల్మాన్‌తో పాటు గర్ల్‌ఫ్రెండ్‌ లులియా వంతూర్‌ సైతం ఉన్నారు. కాగా సల్మాన్‌ మాజీ ప్రియురాలు సంగీత బిజ్లానీ సైతం అర్పితాఖాన్‌ కూతురిని చూడటానికి రావడం విశేషం. 

దీనికి ముందు సల్లూ భాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి మామయ్యను అయ్యానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పుట్టినరోజున గొప్ప బహుమతి అందుకున్నానని.. ఇది తనకెంతో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. అయత్‌ పేరు పెట్టడానికి కారణం అడగ్గా.. కుటుంబంలో అందరి పేర్లు ఎస్‌ లేదా ఏ తోనే మొదలయ్యాయని అందుకే అయత్‌ పేరు పెట్టామని అన్నారు. ‘మరోసారి మామయ్యను అయ్యాను కానీ తండ్రిని మాత్రం కాలేకపోయాను’ అని నవ్వుతూ అన్నారు. కాగా, ప్రభుదేవా దర్శకత్వం వహించిన దబాంగ్‌-3 సల్మాన్‌ పుట్టిన రోజునే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన అత్యధిక సినిమాలు సల్మాన్‌ ఖాతాలోనే ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా