సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

31 Mar, 2020 09:00 IST|Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషాయాన్ని సల్మాన్‌ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అంటూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

అబ్దుల్లా మృతి పట్ల సల్మాన్‌ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కాగా వ్యక్తిగతంగా బాడీబిల్డర్‌ అయిన అబ్దుల్లా సల్మాన్‌తో కలిసి అనేక వేదికలపై కనిపించారు. వీరిద్దరూ కలిసి జిమ్‌ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్‌ గతంలో అనేకసార్లు సోషల్‌మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.

Will always love you...

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా