నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

26 Jul, 2019 03:43 IST|Sakshi

వయసు 53. అయినప్పటికీ ‘బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ లిస్ట్‌’లో కండలు తిప్పుకుంటూ ముందు వరుసలో ఉంటారు సల్మాన్‌ ఖాన్‌. బ్యాచిలర్‌ కాబట్టి బుట్టల కొద్దీ మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వస్తుంటాయి అనుకోవచ్చు. కానీ అలాంటిదేం ఇప్పటివరకూ జరగలేదట. ‘‘సినిమాల్లో హీరోయిన్లు నా ప్రేమ కోసం వెనకబడ్డ సందర్భాలున్నాయి. పెళ్లి చేసుకోమని అడిగిన సీన్లూ ఉన్నాయి. కానీ నిజజీవితంలో ఇప్పటివరకూ ఒక్క అమ్మాయి కూడా నా దగ్గరకు పెళ్లి ప్రపోజల్‌ తీసుకురాలేదు’ అన్నారు సల్మాన్‌ ఖాన్‌. దానికి ఓ కారణం కూడా చెప్పారు. ‘‘నేను క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌లు చేయలేను. ఎందుకంటే.. ఆ కొవ్వొత్తుల వెలుతురులో తినడానికి చాలా తంటాలు పడుతుంటాను. ‘ఇప్పటివరకూ నాకెవరూ ప్రపోజ్‌ చేయలేదే?’ అని అప్పుడప్పుడు ఫీల్‌ అవుతుంటాను’ అని ఫీల్‌ అయ్యారు భాయ్‌.

మరిన్ని వార్తలు