స్వరరాగ ఝరి సాలూరి రాజేశ్వరావు

11 Oct, 2013 03:30 IST|Sakshi
స్వరరాగ ఝరి సాలూరి రాజేశ్వరావు
ఐదు దశాబ్దాలకు పైగా చలన చిత్ర రంగంలో తనదైన ముద్రవేసుకున్న సంగీత దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకుల జంట శంకర్-జైకిషన్‌లు కూడా చిత్ర రంగంలో 15 ఏళ్లు మాత్రమే తమ హవా కొనసాగించారు. సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరావు ఏకబిగిన (1934-1986) 52 ఏళ్లకు పైగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి సంగీత ఘనాపాటిగా రికార్డు సృష్టించారు. అక్టోబర్ 11న సాలూరి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం....
 
 అన్నానగర్, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా (నేడు శ్రీకాకుళం) సాలూరు గ్రామ సమీపంలోని శివరామపురంలో 1922 అక్టోబరు 11న సాలూరి రాజేశ్వరరావు జన్మించా రు. సాలూరి తండ్రి సన్యాసిరాజు ప్రముఖ మృదంగ విద్వాంసులు. అం తేగాక గీత రచయిత కూడా. ఆయన ప్రముఖ వయోలినిస్టు ద్వారం వెంకట స్వామినాయుడు కచేరిలకు మృదంగ సహకారాన్ని అందిస్తుండేవారు. తండ్రి రక్తం సాలూరీలోనూ ప్రవహించింది. 1934లో అంటే సాలూరి రాజేశ్వరరావుకు 12 ఏళ్ల వయసప్పుడు హచిన్స్ రికార్డింగ్ కంపెనీ అధినేతలు విజయనగరానికి వచ్చారు. స్టేజిమీద అద్భుతం గా హార్మోనియం వాయిస్తూ గీతాలాపన చేస్తున్న సాలూరిని గమనించారు. ఆయనలోని సంగీత జ్ఞానిని గుర్తించా రు. 
 
 7వ ఏటనే స్టేజి ప్రదర్శనలు ఇవ్వ డం మొదలు పెట్టిన సాలూరికి కర్ణాటక సంగీతంలోని ఏ రాగాన్ని అయినా ఇట్టే గుర్తు పట్టి దాని లక్షణాలు వివరించే నేర్పు ఉండేదని తండ్రి సన్నాసిరాజు హచిన్స్ అధికారులకు చెప్పడంతో వారు వాళ్లిద్దర్నీ తమతో బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ గూడవల్లి రాంబ్రహ్మం, పి.వి.దాసు నిర్మాతలుగా నిర్మిస్తున్న భగవద్గీత అనే చిత్రంలో సాలూరి మొట్టమొదటసారి గా నేపథ్యగానాన్ని అందించారు. సాలూరిలోని గళ మాధుర్యానికి పరవశులైన గూడవల్లి రాంబ్రహ్మం ఆయ న్ను మద్రాసుకు తీసుకొచ్చి తాను నిర్మిస్తున్న శ్రీకృష్ణలీలలు అనే చిత్రంలో బాలకృష్ణుడి వేషం వేయించారు. 1935లో ఈ చి త్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. దీంతో సాలూరి పేరు ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల్లో మారుమోగింది. 1936లో వచ్చిన మాయాబజార్ చిత్రంలో సాలూరి అభిమన్యుడి పాత్రను పోషించారు. అనంత రం కలకత్తాలోని ఒక నిర్మాణ కంపెనీ సాలూరీకి తమ కీచకవధ చిత్రంలో పాత్రనివ్వడం ఆయనలోని సంగీత జ్ఞానానికి ఒక గొప్ప మేలుకొలుపు అయింది. 
 
 ఆ సమయం లో సాలూరి ప్రముఖ గాయకులు కుందన్‌లాల్ సైగ ల్, పంకజ్‌మాలిక్‌తో పరిచయమై అద్భుతాలను సృష్టించే సాలూరిని తయారు చేసింది. ఏడాది పాటు  సైగల్ వద్ద హిందుస్తానీ సంగీతంతో పాటు సితార, గిటారు  వాయిద్యాలను నేర్చుకున్నారు. పంకజ్‌మాలిక్ వద్ద తబలా, మాండోలిన్, పియానో, ఎలక్ట్రిక్ గిటార్ వాయిద్యాలను నేర్చుకున్నారు. 
 
 సంగీత దర్శకుడిగా: 1938లో కలకత్తా నుంచి మద్రాసు చేరిన సాలూరి రాజేశ్వరరావు జయరామయ్య నిర్మించిన విష్ణు ్డలీలలు అనే తమిళ చిత్రంలో బల రాముని పాత్ర ధరించారు. అలాగే దా నికి అవసరమైన నేపథ్య గానాన్ని తన సొంతగళం నుంచే వినిపించారు. అనంతరం జయప్రద చిత్రానికి తొలి సారిగా సంగీత దర్శకత్వం వహించా రు. ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా మారిపోయారు. బాలనాగమ్మ, ఇల్లాలు ఆయనకు మం చి పేరు తెచ్చాయి. చిత్రాల్లో నేపథ్యగానం లేని రోజుల్లో సాలూరి సినిమా రంగ ప్రవేశం చేశారు. ఇల్లాలు చిత్రం నుంచి నేపథ్య సంగీతం - గానాలకు తెరతీశారు. అదే విధంగా లలిత సంగీ తాన్ని, దాన్ని శైలిని కూడా తొలిసారి సంగీతంలో ప్రయోగం చేసింది కూడా సాలూరే కావడం విశేషం. 
 
 1940-1950 మధ్య కాలంలో ఆయన జెమినీ స్టూడియోస్ నిర్మించే సినిమాలకే సం గీత దర్శకత్వం చేశారు. 1950లో బీ ఎన్ రెడ్డి తన మల్లీశ్వరి చిత్రానికి సం గీత నిర్దేశం చేయమనడంతో సాలూరి వేగానికి కళ్లెం వే సేవారు లేకపోయారు. సాలూరి ఎక్కువగా అభేరి, సింధుభైర వి, కాపీ, కల్యాణి, పహడ్, హిందోళం వంటి రాగాల్లోనే ఎక్కువ పాటలకు బాణీలు కట్టారు. విప్ర నారాయణ, మి స్సమ్మ, జీవన్ముక్తి, అపద్బంధు, చెంచులక్ష్మి, భీష్మ, పాదుకాపట్టాభిషేకం, రత్నమాల, వింధ్యారాణి, అపూర్వ సహోదరులు, తదితర 123 తెలుగు చిత్రాలకు, ఐదు కన్నడ చిత్రాలకు, 12 తమిళ చిత్రాలకు, ఐదు హిందీ చిత్రాలకు సంగీతం అందించారు.
 
 కొస మెరుపు: తెలుగు చిత్రాల్లో పా శ్చాత్య సంగీత బాణీలను తొలిసారిగా ప్రవేశపెట్టింది సాలూరే. చిట్టి చెల్లెలు చిత్రానికి ఆయన స్వర పరచిన ఈ రే యీ తీయనిదీ.. ఈ చిరుగాలి ఇంపైన ది అనే గీతాన్ని ఆయన ప్రముఖ ఫ్రెం చి కంపోజర్ పాల్‌మురియట్ ఆల్బం లోని లవ్ ఈజ్ బ్లూ అనే గీత స్పూర్తితో బాణీను కట్టారు.
 
 గౌరవాలు - పురస్కారాలు: 1980లో కన్యకా పరమేశ్వరి చిత్రానికి నంది అవార్డు, 1992 రఘుపతి వెంకయ్య అవార్డు, తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు, 1979లో ఆంధ్రావర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టుకు ఆస్థాన విద్వాంసుడుగా కొన్నేళ్లు పని చేశారు.