‘సామజవరగమన’  వీడియో సాంగ్‌ వచ్చేసింది!

16 Feb, 2020 17:44 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ చిత్రంలోని ప్రతీ పాట ఆణిముత్యమే. ముఖ్యంగా ‘సామజవరగమన’  లిరికల్‌ సాంగ్‌ ఎంతటి ట్రెండ్‌ సృష్టించింతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత ప్రియుల మనసుల్ని అంతగా దోచిన ఆ పాటను తమన్‌ కంపోజ్‌ చేయగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించాడు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. ఈ క్రేజీ కాంబినేషనలో వచ్చిన సాంగ్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేసి రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పటివరకు లిరక్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంటే.. తాజాగా ఈసినిమాలోని ‘సామజవరగమన’ పూర్తి వీడియో సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 

లిరికల్‌ సాంగ్‌ మాదిరే వీడియో సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ వీడియో సాంగ్‌ రిలీజ్‌ అయిన నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఐదు లక్షల వ్యూస్‌తో పాటు 63 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. పాటకున్న క్రేజ్‌తో పాటు వీడియోలో పూజా హెగ్డే అందాలు.. అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాకుండా విజువల్‌ పరంగా కూడా హై రిచ్‌గా కనిపిస్తుండటంతో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ వీడియో సాంగ్‌. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించాడు. 

పూర్తి పాట మీకోసం
పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు 
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు 
సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా

చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పింఛమా విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా
అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా

చదవండి:
ఏప్రిల్‌ 8న ‘అల..వైకుంఠపురములో’
‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ
​​​​​​​

మరిన్ని వార్తలు