‘1.5 మిలియన్‌ వ్యూస్‌.. లక్ష లైక్స్‌’

31 Dec, 2019 15:52 IST|Sakshi

‘సామజవరగమన’ సోషల్‌ మీడియాను మరోసారి షేక్‌ చేస్తోంది. న్యూఇయర్‌ కానుకగా ఈ సూపర్‌ సాంగ్‌ వీడియో టీజర్‌ను ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటికే ‘సామజవరగమన’ లిరికల్‌ సాంగ్‌ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ పాట వీడియో ప్రోమోను కూడా నెటిజన్లు అంతకు మించి ఆదరిస్తున్నారు. ఈ వీడియో సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే 1.5 మిలియన్‌కు పైగా రియల్‌ వ్యూస్‌.. లక్షకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకొవడంతో పాటు సినీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ పాటలోని సాహిత్యాన్ని, భావాన్ని హీరో అల్లు అర్జున్‌ చేత దృశ్య రూపంలో పలికించారు కొరియోగ్రఫర్స్‌. 

స్లైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రేజీ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ (మ్యూజికల్‌ కన్సెర్ట్‌) ఈవెంట్‌ జనవరి 6న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

ఇక ఈ బన్ని-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లు ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్‌ వంటి భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

చదవండి: 
ష్‌.. ఎవరికీ చెప్పకండి: పూజా హెగ్డే
6న బన్నీ ఫ్యాన్స్‌కు పండగే పండగ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు