బామ్మగా సమంత..?

4 Aug, 2018 11:52 IST|Sakshi

పెళ్లి తరువాత సమంత సినిమాల ఎంపికలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాగచైతన్యతో వివాహం తరువాత రంగస్థలం, అభిమన్యుడు సినిమాలతో ఘన విజయం అందుకున్న సామ్, ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ఓకె చెపుతున్నారు. ఇప్పటికే కన్నడ సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కుతున్న యు టర్న్‌ లో నటిస్తున్న సామ్‌, మరో డిఫరెంట్‌ మూవీ కి ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనున్నారట. 2014లో రిలీజ్‌ అయిన కొరియన్‌ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షాంటసీ జానర్‌లో తెరకెక్కనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్‌ చేయనున్నారు. ప్రస్తుతం యు టర్న్‌, సీమరాజా, సూపర్‌ డీలక్స్‌ సినిమాలతో బిజీగా ఉన్న సమంత త్వరలో నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు