బాబ్బాబూ...అంటూ బతిమాలితే!

29 May, 2017 00:26 IST|Sakshi
బాబ్బాబూ...అంటూ బతిమాలితే!

చైతూ (నాగచైతన్య) అస్సలు ఒప్పుకోలేదు! వద్దంటే వద్దన్నాడు. ఎంతోసేపు మొత్తుకున్నానో తెలుసా? ‘బాబ్బాబ్బాబు....’ అంటూ బతిమాలితే చివరకు ఈ వీడియో బయటపెట్టడానికి ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చారు చైతూ లవ్‌ లేడీ సమంత.

శుక్రవారం అక్కినేని అభిమానులందరూ థియేటర్లలో ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ సిన్మా సందడిలో మునిగి తేలితే... చైతూ, సమంతలు జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ, చెమటలో మునిగి తేలారు.చైతూ మరియు తాను హెవీ వెయిట్స్‌ లిఫ్ట్‌ చేసిన వీడియోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. చైతూ 161 కిలోలు లిఫ్ట్‌ చేస్తే, సమంత 90 కిలోలు లిఫ్ట్‌ చేశారట. సిల్వర్‌ స్క్రీన్‌పై స్లిమ్ముగా కనిపించాలంటే.. జిమ్ముల్లో ఇలా చెమట చిందించక తప్పదు మరి!!

>