స్పెషల్‌ గెస్ట్‌!

1 Mar, 2019 01:00 IST|Sakshi
నాగార్జున, సమంత

స్క్రీన్‌ మీద సందడి చేయడానికి మామా, కోడలు నాగార్జున, సమంత మరోసారి రెడీ అవుతున్నారట. ‘రాజుగారి గది 2’లో నాగార్జున, సమంత నటించిన విషయం తెలిసిందే. నాగార్జున లేటెస్ట్‌ చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌ ఇది.  రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జునే నిర్మించనున్నారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే పాత్రలో సమంత కనిపించనున్నారని టాక్‌. సుమారు 5–10 నిమిషాలు ఆమె కనిపిస్తారట.

ఈ పాత్రకు సమంత అయితే బావుంటుందని, కోడలిని మామ అడగటం, స్యామ్‌ వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయని ఇండస్ట్రీ టాక్‌. అలాగే చిత్రదర్శకుడు రాహుల్, సమంత మంచి స్నేహితులు. కెరీర్‌ స్టార్టింగ్‌లో సమంత చేసిన తమిళ చిత్రం ‘మాస్కోవిన్‌ కావిరి’లో రాహుల్, సమంత జంటగా నటించారు. సో.. రాహుల్‌ గెస్ట్‌గా చేయమంటే సమంత కాదంటారా? ఈ నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ కానున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ శాతం షూటింగ్‌ పోర్చుగల్‌లో జరగనుంది. ఇందులో నాగార్జున భార్యగా రకుల్‌ నటించనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు