మీ ధైర్యం అభినందనీయం

10 Oct, 2018 00:33 IST|Sakshi

మీటూ ఉద్యమం ఇండియన్‌ ఇండస్ట్రీలలో కూడా మొదలైంది. చిత్రపరిశ్రమలోని కొందరు స్త్రీలు తమపై జరిగిన వేధింపుల గురించి బయటకు చెబుతుంటే మరికొందరు అజ్ఞాతంగా ఉండి తమకు జరిగిన చేదు అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. ‘‘ఇలా బయటకు వచ్చిన వారు చాలా ధైర్యవంతులు, వాళ్లను కచ్చితంగా అభినందించాలి. అలాగే మీటూ ఇండియా ఉద్యమాన్ని సపోర్ట్‌ చేస్తున్నా’’ అన్నారు సమంత. వాళ్లను ఉద్దేశిస్తూ ట్వీట్‌ కూడా చేశారు. ‘‘మీటూ’ అంటూ స్త్రీలందరూ ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది.

మీ ధైర్యం అభినందనీయం. ఇలాంటి విషయాల గురించి బయటకు చెప్పినప్పుడు ‘రుజువేంటి’ అని కొందరు పురుషులు అడుగుతుంటారు. కొందరు స్త్రీలు కూడా ఈ సందేహాన్ని వ్యక్తం చేసి, బాధితులను కించపరచడానికి చూస్తుంటారు. కానీ మీరు మాత్రం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు బయటకొచ్చి మాట్లాడటం వల్ల చాలామందిని రక్షిస్తున్నారు. ప్రపంచం గురించి అంతగా అవగాహన ఉండని చిన్న అమ్మాయిలను కూడా కాపాడుతున్నారన్నది దృష్టిలో పెట్టుకోండి. అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్‌’’ అంటూ బాధితులు మరికొందరు బయటకు వచ్చేలా ధైర్యం నూరిపోశారు. 

మరిన్ని వార్తలు