మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీలో..

23 Feb, 2020 02:57 IST|Sakshi

‘జాను’ తర్వాత సమంత ఏ సినిమా చేయబోతున్నారు? అంటే తెలుగు విషయంలో క్లారిటీ లేదు. ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారని టాక్‌. ఇక తమిళం విషయానికొస్తే.. ‘కాదు వాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమా అంగీకరించారు. తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ టాక్‌. ‘మాయ’ (2017), ‘గేమ్‌ఓవర్‌’ (2019) వంటి  చిత్రాలు తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌ ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. సమంత చేసిన ‘యు టర్న్‌’, ‘ఓ బేబి’ వంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు తెలుగులో మంచి హిట్‌ అయ్యాయి. ఇప్పుడు తమిళంలోనూ ఆ మేజిక్‌ని రిపీట్‌ చేస్తారని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా