ఆ కష్టం తెలుస్తోంది!

7 Jun, 2020 05:36 IST|Sakshi

‘‘మన భోజనం మన చెంతకు చేరడం వెనక ఎంత పెద్ద కష్టం దాగి ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవు తోంది’’ అంటున్నారు సమంత. ఇటీవలే ఆమె తన టెర్రస్‌పై గార్డెనింగ్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ గార్డెనింగ్‌ క్లాసుల ద్వారా తెలుసుకుంటున్న కొత్త విషయాలు తనకు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయని అంటున్నారు సమంత. ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ – ‘‘ఆసక్తికర విషయాలు తెలుసుకునే సమయం మీ దగ్గర ఉన్నట్లయితే గార్డెనింగ్‌ను స్టార్ట్‌ చేయమని నేను సలహా ఇస్తాను. ప్రస్తుతం నేను గార్డెనింగ్‌ చేస్తున్నాను.

ఇన్నాళ్లూ భూమితో నాకు ఉన్న కనెక్షన్‌ ను నేను కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోంది. నా భోజనం ప్లేటు నా టెబుల్‌పైకి రావడం వెనక ఎంత పెద్ద పని దాగి ఉందో అర్థం అవుతోంది. ఒక చిన్న విత్తనాన్ని నాటినప్పుడు అది భూమిని చీల్చుకుని పైకి రావడానికి చాలా స్ట్రగుల్‌ అవుతుంది. ఆ తర్వాత అది రోజులు, నెలలు, సంవత్సరాలు పెరుగుతుంది. ఈ విధానానికి మనం అందరం కనెక్టయ్యే ఉంటామని మనం అర్థం చేసుకోవాలి’’ అన్నారు. అలాగే సమంత  కుకింగ్‌ క్లాసుల్లో  చేరారు. ఓ సూపర్‌ సూప్‌ను తయారు చేశారు. తన గార్డెనింగ్‌లో పెరిగిన మొక్కల ఆకులతోనే సమంత ఈ సూప్‌ను తయారు చేశారట.

ఇంకా ఫెయిల్‌ అవుతున్నాను
కొబ్బరికాయను వెంటనే పగలుకొట్టడంలో తరచూ ఫెయిల్‌ అవుతుంటానని అంటున్నారు సమంత. ‘‘చాలా ఏళ్లు గడిచాయి. దాదాపు 50 సినిమాల కోసం కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చింది. అలా యాభైసార్లు ప్రాక్టీస్‌ కూడా చేశాను. కానీ కొబ్బరికాయను కొట్టడంలో ఇప్పటికీ ఫెయిల్‌ అవుతున్నాను. కొందరు కొన్ని విషయాలు ఎప్పటికీ నేర్చుకోలేరు’’ అని సమంత తన ఇన్‌ స్టాగ్రాగామ్‌లో షేర్‌ చేశారు.


సూప్‌ రుచి చూస్తున్న సమంత

మరిన్ని వార్తలు