తమన్నాకు బర్త్‌డే విషెస్‌ వెల్లువ..

21 Dec, 2019 13:09 IST|Sakshi

తమన్నా భాటియా.. పేరు వినగానే గుర్తొచ్చేది తన మిల్కీ అందాలు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ  చెక్కు చెదరనీ అందతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. డిసెంబర్‌ 21న ఈ మిల్క్‌ బ్యూటీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఇటు అభిమానులతోపాటు అటు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. ఇప్పటికే అక్కినేని సమంత, రానా దగ్గుపాటి, కాజల్‌ అగర్వాల్‌, రష్మిక మందన్న, అజిత్‌  తమదైన శైలిలో విషెస్‌ చెప్పగా.. మిల్కీ పుట్టిన రోజు సందర్భంగా తమన్నా తాజాగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. ఇందులో ఆర్మీ ప్యాంట్‌ స్టెప్పులతో అభిమానులను కేక పెట్టిస్తోంది. 

‘పుట్టినరోజు శుభాకాంక్షలు గార్జియస్‌ తమన్నా.. నీవు అనుకున్న ప్రతిదీ నీకు దక్కాలని ఆశిస్తున్నా. నీ అంకిత భావానికి, కృషికి అభినందనలు. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ సమంతా ట్వీట్‌ చేయగా. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్మి.. ఇలాగే ఎప్పుడూ ఆనందాన్ని పంచుతూ.. నువ్వు కోరుకున్నఅన్ని ఆనందాలను ఆ దేవుడు అందివ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ కాజల్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు.  

ఇక ఇటీవలే సైరా నర్సింహరెడ్డి సినిమాతో ఘన విజయం అందుకున్న తమన్నా సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న‘సరిలేరు నీకెవ్వరు’ నిమాలో మహేష్ బాబుతో కలిసి ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 5న నిర్వహించనున్నారు. కాగా ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించిన ‘బోలే చుడియాన్’ 2020లో విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా