ఉగాదికి ప్రారంభం

3 Apr, 2019 02:34 IST|Sakshi
శర్వానంద్, సమంత

తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తమిళ ‘96’ చిత్రం తెలుగు రీమేక్‌ ఆరంభం కానుందని తెలిసింది. విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘96’. ‘దిల్‌’ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సమంత నటిస్తారు.

ఈ సినిమా ప్రారంభోత్సవం ఉగాది రోజున జరగనున్నట్లు తెలిసింది. ఆ రోజున ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. స్కూల్‌ టైమ్‌లో ప్రేమలో పడ్డ ఓ అబ్బాయి, అమ్మాయి ఆ తర్వాత విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత కలిసిన ఈ ఇద్దరి మనోభావాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై ఈ సినిమా కథనం ఉంటుంది.

మరిన్ని వార్తలు