ఈ ఇడియట్‌ను చూడండి : సమంత

19 Jun, 2019 16:32 IST|Sakshi

దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సింగర్‌ చిన్మయి శ్రీపాదకు సోషల్‌ మీడియాలో వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి.  లైంగిక వేధింపుల బాధితులకు మద్దతుగా నిలిచినందుకు.. ఇండస్ట్రీ ‘పెద్ద మనుషుల’ కారణంగా ఆమె కెరీర్‌ ప్రమాదంలో పడింది. డబ్బింగ్‌ చెప్పేందుకు అవకాశం లేకుండా ఆమె గొంతుక వినిపించకుండా కొంతమంద్రి కుట్ర పన్నారు. అయితే తాజాగా సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఓ బేబీ సినిమా ద్వారా తమిళ డబ్బింగ్‌ చెప్పే అవకాశం చిన్మయికి లభించింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్న చిన్మయి..‘ సమంతకు తమిళ్‌లో డబ్బింగ్‌ చెప్పాను. నిజానికి నందినిరెడ్డి, సమంత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని ఓ బేబి టీజర్‌ను జతచేశారు.

ఈ క్రమంలో ఎంతో మంది చిన్మయికి మద్దతునిస్తుండగా.. మరికొంత మాత్రం.. ‘ఫెమినిస్టులు అందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. ఈ సినిమా ప్లాపవడం ఖాయం’ అంటూ నెగిటివ్‌ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్రకు గొంతుతో జీవం పోసే చిన్మయికి సమంత అండగా నిలబడ్డారు. ‘ థ్యాంక్యూ... ప్రపంచం ఓ మూర్ఖున్ని కలిసింది. ఓ మూర్ఖుడు ప్రపంచంలోకి వచ్చాడు’ అంటూ సమంత ట్వీట్‌ చేశారు. దీంతో.. ‘కౌంటర్‌ అదిరింది సామ్‌. ఆడవాళ్లకు మరింత శక్తి రావాలి. ఓ బేబీ సినిమా కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తొలి సినిమాతో ‘ఏ మాయ చేశావే’తోనే సమంత స్టార్‌గా మారడానికి ప్రధాన కారణం.. నటనతో పాటు ఆ సినిమాలో వినిపించిన గొంతేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గమ్మత్తైన ఆ గొంతు చిన్మయిది. తొలి సినిమా నుంచి సమంతకు చిన్మయి తన గొంతు అరువు ఇస్తూనే ఉన్నారు. ఇక వారిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’