సమంత రహస్య వివాహమా?

16 Oct, 2013 13:19 IST|Sakshi
సమంత రహస్య వివాహమా?

నిత్యం వార్తల్లో ఉంటోన్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ చెన్నై బ్యూటీపై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే రహస్యంగా వివాహం చేసుకోనుందని ప్రచారం సాగుతోంది. ఈ వదంతులపై సమంత స్పందించింది. తన వివాహం గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒకరితో సహజీనం చేస్తున్నానని, రహస్యంగా వివాహం చేసుకోనున్నానని అంటున్నారని పేర్కొంది. ఇవన్నీ అబద్ధాలని స్పష్టం చేసింది.

అసలు తానెందుకు రహస్యంగా వివాహం చేసుకోవాలని ప్రశ్నించింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని, కొన్నేళ్ల తర్వాతే దీని గురించి ఆలోచిస్తానని వివరించింది. తాను వివాహం చేసుకునే ముందు అందరికీ తెలియజేస్తానని పేర్కొంది. వచ్చే ఏడాది తమిళ చిత్రాలపైనే పూర్తిగా దృష్టి సారిస్తానని స్పష్టం చేసింది.

తాను నటించిన తెలుగు చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని చెప్పింది. తర్వాత తెలుగు చిత్రం ఏదీ అంగీకరించేది లేదని తెలిపింది. ఇటీవలి ఆమెను  ఇంతకీ మీ ప్రేమ ప్రయాణం ఎలా సాగుతోందని మీడియా అడిగిన ప్రశ్నకు 'చాలా బలంగా సాగుతోంది. మా ప్రేమకు ‘బ్రేకప్’ ఉండదు. అంత అవగాహనతో ముందుకెళుతున్నాం'అని చెప్పింది కూడా.