తీవ్రవాదిగా మారిన సమంత..!

14 Nov, 2019 07:25 IST|Sakshi

సినిమా: బ్యూటీ క్వీన్‌ సమంత ప్రస్తుతం ఒక ఆంగ్ల వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. అందులో తీవ్రవాదిగా కనిపించనుందట. ఫ్యామిలీ మెన్‌–2 పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌కు మొదటి భాగం మంచి ప్రేక్షకాదరణను పొందటంతో దాని సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ వెడ్‌ సిరీస్‌లోని సమంత ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇక కొత్తగా ఈ సుందరి దర్శకులకే సలహాలు ఇస్తోందట. కొత్త ఆలోచించమని చెబుతోందట. పెళ్లికి ముందు చిన్న, పెద్ద అనే భేదం లేకుండా అందరు హీరోలతోనూ నటించేసింది. వాటిలో అధికంగా గ్లామర్‌ పాత్రలే ఉన్నాయి. నిజానికి పెళ్లికి తరువాత కూడా సమంతను ఆ తరహా గ్లామర్‌ పాత్రల్లో చూడటానికి ఆమె అభిమానులు రెడీగానే ఉన్నారు. అయితే తను మాత్రం నటనకు అవకాశం ఉన్న భిన్నమైన పాత్రల్లో నటించాలనే నిర్ణయానికి వచ్చింది.

ఆ విధంగా ఈ మధ్య యూటర్న్, మజిలీ, ఓ బేబీ వంటి చిత్రాల్లో నటించింది. వాటిని ప్రేక్షకులు ఆదరించడంతో ఆమెలో మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది. దీంతో ఇంతకు ముందు కమర్షియల్‌ కథా పాత్రల్లో నటించాననీ, ఇకపై తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. తమిళం సూపర్‌ హిట్‌ చిత్రం 96 తెలుగు రీమేక్‌లో నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలోనే నటిస్తోంది. తమిళంలో నటి త్రిష పోషించిన పాత్రలో సమంత నటించింది. ఈ చిత్రం తరువాత మరే కొత్త చిత్రాన్ని కమిట్‌ కాలేదు. దీనికి కారణం అవకాశాలు లేక మాత్రం కాదు. నిజానికి చాలా అవకాశాలు వస్తున్నాయట. అయితే అవన్నీ సాదా సీదా పాత్రలు కావడంతో నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో కొత్తగా ఆలోచించాలని దర్శక, రచయితలకు సూచనలు ఇస్తోందట. వైవిధ్యంతో కూడిన కథలతో వస్తే వెంటనే ఓకే చేస్తానని చెబుతోందట. ప్రస్తుతం యువ దర్శకులు చెప్పిన కథలు ఆకట్టుకున్నట్లు, వాటిలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా