అదే నా విజయ రహస్యం

16 May, 2016 05:09 IST|Sakshi
అదే నా విజయ రహస్యం

విజయం అందుకోవడం అంత సులభం కాదు. దాన్ని పొందగలిగితే ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు అన్నిటికీ మించి ఆనందం కలుగుతాయి. అయితే విజయం ఎండమావిగా దోబూచులాడుతున్న వారు దాన్ని సాధించడం ఎలా అని మదన పడుతుంటారు. అలాంటి వారికి నటి సమంత చెప్పిన బదులేమిటో చూద్దాం. ఆదిలో చాలా మందిలాగా సక్సెస్ కోసం పోరాడిన సమంతకు తొలుత విజయానందాన్ని అందించిన చిత్రం ఏమాయ చేసావే. అది తెలుగు చిత్రం. అలా అక్కడ వరుస విజయాలను సొంతం చేసుకున్నా తమిళంలో విజయం కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది.

నిరంతర పోరాటం తరువాత కత్తి చిత్రంతో ఎట్టకేలకు కోలీవుడ్‌లోనూ తొలి విజయాన్ని అందుకున్నారు. ఇటీవల తెరి, 24 చిత్రాలతో వరుసగా సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న సమంత తమిళం, తెలుగు అంటూ బిజీబిజీగా నటించి అలసి పోయారట. ప్రస్తుతం చిన్న విరామం తీసుకుని విదేశాలు చుట్టి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల అభిమానులతో ఆన్ లైన్‌లో చిట్‌చాట్ చేసిన సమంత వారితో బోలెడు
 విషయాలను షేర్‌చేసుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.

విజయ్‌తో నటించిన తెరి, సూర్యకు జంటగా నటించిన 24 చిత్రాల విజయాలు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఇలానే వరుసగా విజయాలు అందాలని ఆశిస్తున్నాను. మీకో విషయం చెప్పనా నాకు పోటీ అంటే చాలా ఇష్టం. పోటీ ఉంటేనే నాలో ఉద్వేగం పెరుగుతుంది. అయితే నేను పోటీ పడే వారిని తరుచూ మారుస్తుంటాను. అందుకే వారి పేర్లను చెప్పను. ఇక నా విజయ రహస్యం గురించి చాలా మంది అడుగుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కఠిన శ్రమే నా విజయానికి కారణం.

యువతకు నేను చెప్పేదొక్కటే కలలు కనండి. సవాళ్లను ఎరుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగండి అంటూ అభిమానుల పలు ప్రశ్నలకు చిరునవ్వుతోనే బదులిచ్చిన ఈ చెన్నై చిన్నది ఎన్నికల గురించి స్పందించమన్నప్పుడు అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా