జూలై 5న స‌మంత ఫ‌న్ రైడ‌ర్‌

1 Jun, 2019 12:16 IST|Sakshi

స‌మంత అక్కినేని, సీనియర్‌ నటి ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ మూవీ ఓ బేబీ. బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంత‌ర కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంబించిన చిత్రయూనిట్ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.

జూలై 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన‌ ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ రైడ‌ర్‌గా ఈ సినిమా రూపొందించినట్టుగా దర్శక నిర్మాతలు వెల్లడించారు. కుటుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గ‌డ‌పాల‌నే విష‌యాల‌ను ఆలోచింప చేసే కోణంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.

కోరియన్‌ మూవీ మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్షన్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆర్టిస్టులతో పాటు సాంకేతిక బృందంలోనూ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ప‌నిచేయ‌డం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా