‘బేబీ ముసల్ది కాదు.. పడుచు పిల్ల’

20 Jun, 2019 10:41 IST|Sakshi

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ ఓ బేబీ. 70 ఏళ్ల మనిషి తిరిగి 23 ఏళ్ల యువతిగా మారితే తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియన్‌ మూవీ మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కతున్న ఈసినిమాకు నందినీ రెడ్డి దర్శకురాలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇప్పటి వరకు కామెడీ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే ఓ బేబీని ప్రమోట్‌ చేశారు. కానీ తాజా ట్రైలర్‌లో సినిమాలోని ఎమోషనల్‌, రొమాంటిక్‌ కంటెంట్‌ను కూడా చూపించారు. సమంత నటన సినిమాగా హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. సినిమాలో అడవి శేష్‌, జగపతి బాబు కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారన్న విషయాన్ని ఈ ట్రైలర్‌లో రివీల్‌ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్‌, క్రాస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా