నన్ను తిట్టుకుంటారనుకున్నాను!

9 Jan, 2020 00:11 IST|Sakshi
సమంత

కొన్నిసార్లు సినిమాలోని పాత్రలు రిస్కీగా ఉంటాయి. అనుకున్న విధంగా తెరమీద కనిపించకపోతే నటులు విమర్శలపాలు కావాల్సి ఉంటుంది. అనుకున్నట్టే జరిగితే అన్నీ ప్రశంసలే. ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమా అంగీకరించే ముందు సమంత కూడా ఇలాంటి సందర్భాన్నే ఎదుర్కొన్నారట. ఈ సినిమాలో సమంత పాత్ర బోల్డ్‌గా కొంచెం నెగటివ్‌ షేడ్స్‌తో ఉంటుంది. అయితే ఈ పాత్ర సమంతకు మంచి పేరు తీసుకొచ్చింది. బెస్ట్‌ యాక్టర్‌గా తమిళంలో అవార్డును కూడా అందుకున్నారు. ‘‘ఈ పాత్రను అంగీకరించే సమయంలో ప్రేక్షకులు నన్ను విపరీతంగా తిట్టుకుంటారు లేదా బాగా అభినందిస్తారు అనుకుంటూ ఒప్పుకున్నాను.

నా పాత్రకు ఎటువంటి విమర్శలు రాలేదు. ఈ సినిమాలో నటించడం నాకో మంచి అనుభవం’’ అని అవార్డును అందుకున్న తర్వాత మాట్లాడారు సమంత. ఇదిగో ఇక్కడ లేత గులాబీ రంగు చీరలో సమంత కనిపిస్తున్నారు కదా. ఈ డిజైనర్‌ శారీలోనే ఆమె వేడుకకు హాజరయ్యారు. ఫంక్షన్‌లో సమంత చీర ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చీర బాగా నచ్చిందేమో ఆమె స్పెషల్‌గా ఫొటోషూట్‌ చేయించుకున్నారు. చై (భర్త నాగచైతన్యను సమంత ‘చై’ అనే అంటారు) ట్యాటూ కనపడేట్టు ఆమె ఫొటోలు దిగారు. ఫొటోను క్లియర్‌గా గమనిస్తే ‘చై’ ట్యాటూని మీరూ చూడొచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

సినిమా

ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా