నాగ్‌ మామ చాలెంజ్‌ యాక్సెప్టెడ్‌

11 Jul, 2020 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అక్కినేని సమంత మొక్కలు నాటారు. టాలీవుడ్‌ సీనియర్‌ హీరో అక్కినేని నాగార్జున ఛాలెంజ్‌ను స్వీకరించిన  సమంత  శనివారం జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు తన సహనటులు, మహానటి కీర్తి సురేష్, మరో హీరోయిన్‌ రష్మీక మందాన, తన స్నేహితురాలు శిల్పారెడ్డికి మూడు మొక్కలు నాటాల్సిందిగా సవాలు విసిరారు. (సమంత బ్యూటీ థెరపీ వీడియో )

ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని సమంత కొనియాడారు. అంతేకాదు  'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'  చెయిన్‌ను కొనసాగించేలా  ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలంటూ  ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు.   

I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge 🍃‬ ‪from Nag mama 💚 I planted 3 saplings. Further I am nominating @keerthysureshofficial @rashmika_mandanna @shilpareddy.official to plant 3 trees & continue the chain special thanks to @MPsantoshtrs garu for taking this intiative.

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా