ఆ పాత్రకు నో చెప్పిన సమంత..!

13 Jan, 2019 13:15 IST|Sakshi

పెళ్లి తరువాత రూట్ మార్చిన సమంత ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి పిరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న మజిలిలో నటిస్తున్న ఈ బ్యూటీ నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రానికి ఓకె చెప్పింది. ఈ సినిమా సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనుందన్న టాక్‌ గట్టిగా వినిపించింది. కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

అయితే ముందుగా ఈ సినిమాలో వృద్ధ మహిళ పాత్రను కూడా తానే చేయాలని భావించిన సమంత ఇప్పుడు నో చెప్పిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడే ఏజ్డ్‌లుక్‌లో కనిపిస్తే కెరీర్‌ పరంగా నష్టం జరుగుతుందన్న ఆలోచనతో కేవలం యంగ్ లుక్‌ లో మాత్రం నటించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఏజ్డ్‌ రోల్‌ కోసం సీనియర్‌ నటి లక్ష్మీని తీసుకున్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో యువ కథానాయకుడు నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు