సమంత.. కెరీర్‌లో తొలిసారిగా

25 Feb, 2019 08:59 IST|Sakshi

తన కేరీర్‌లోనే తొలిసారిగా ఒక పాత్ర కోసం కష్టపడి నటించినట్లు నటి సమంత పేర్కొంది. ఈ అమ్మడు అంతగా కష్టపడి నటించిన చిత్రం ఏంటబ్బా! సమంత బహుభాషా నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతోంది. గతేడాది నటించిన చిత్రాలన్నీ సమంతను సక్సెస్‌ బాటలో నడిపించాయి. ఈ ఏడాది అది రిపీట్‌ చేయాలని సమంత ఆశ పడుతోంది. అలా ఇటీవల తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం తెరపైకి రానుంది. దీని విజయం సమంతకు చాలా ముఖ్యం. అయితే ఈ బ్యూటీ కష్టపడి నటించిన చిత్రం మాత్రం అది కాదు. తమిళంలో అరండకాండం చిత్రం ఫేమ్‌ త్యాగరాజన్‌ కామరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో నటిస్తోంది. (ఆ పాత్రకు నో చెప్పిన సమంత..!)

ఇందులో ఫాహత్‌ ఫాజిల్‌ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ దశలో ఉంది. ఇందులో విజయ్‌సేతుపతి తొలిసారిగా హిజ్రాగానూ కొంచెం సేపు తళుక్కుమననున్నారు. కాగా నటి సమంత పాత్రా చాలా వైవిధ్యంగా ఉంటుందట. కథనే విభిన్నంగా ఉండటంతో అందులో నటించడానికి ఇంతకు ముందెప్పుడూ లేనంతగా చాలా కష్టపడినట్లు సమంత ఒటీవల ఒక భేటీలో పేర్కొంది. ఇందులోని వేంబు అనే పాత్ర కోసం దర్శకుడి సలహా మేరకు రిహార్సల్స్‌ చేసి నటించానని, ఈ చిత్రంలోని పాత్ర తనకే కాకుండా తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది.కాగా సూపర్‌ డీలక్స్‌ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు