లేడీ డైరెక్టర్‌తో సమంత!?

26 Sep, 2018 20:53 IST|Sakshi

సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే సమంత ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూ టర్న్‌ చిత్రాలతో హిట్‌ కొట్టిన సమంత.. నెక్ట్స్ భర్త చైతో కలిసి ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ చైతూ, సమంతల పెళ్లి రోజు (అక్టోబర్‌ 6)న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘నిన్ను కోరి’  ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్‌ పైకి రాకముందే సమంత మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలిసింది.

‘అలా మొదలైంది’  చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సామ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నందినీ రెడ్డి స్క్రిప్టుకు ఇంప్రెస్‌ అయిన సామ్‌.. ఈ చిత్రంలో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారట. కాగా 2013లో నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘జబర్దస్త్‌’  సినిమాలో సామ్‌ నటించిన సంగతి తెలిసిందే.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు