ఆ ప్రచారం సినిమా వాళ్లు చేసిందే: సమంత

24 Aug, 2018 09:20 IST|Sakshi

తమిళసినిమా: అది సినిమా వాళ్లు చేసే పనేనని అంటోంది నటి సమంత. నటీమణుల్లో ఈ అమ్మడంత లక్కీ హీరోయిన్‌ ఈ తరంలో ఉండరేమో! పెళ్లికి ముందు ఆ తరువాత కూడా కథానాయకిగా బిజీగా అదే సమయంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న నటి సమంత. నిజం చెప్పాలంటే వివాహానంతరమే ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఎక్కువ పేరు తెచ్చిపెడుతున్నాయి. అలా కథానాయకిగా దశాబ్దాన్ని చాలా సులభంగా అధిగమించేసింది. పదేళ్లుగా కథానాయకిగా నటించడాన్ని సాధారణంగానే భావిస్తున్న సమంత దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం. 10 ఏళ్లుగా కథానాయకిగా రాణించడానికి పెద్దగా భావిస్తున్నారు. నా మాదిరిగానే కొందరు కథానాయికలు నటిస్తున్నారు. నాటి కథానాయికలే సినిమాలో నిలదొక్కుకుని నిలిచారని అనేవారు,  ఈ తరం నటీమణులు కూడా పది కాలాల పాటు నిలడతున్నారు అదేవిధంగా. వివాహంతో హీరోయిన్ల మార్కెట్‌ పడిపోతుందనే ఒక అపోహ ఉంది. దాన్ని బ్రేక్‌ చేయాలని భావించాను. అనుకున్నట్టుగానే బ్రేక్‌ చేశాను.

వివాహానంతరం నేను నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. అదేవిధంగా పెళ్లి అనంతరం హీరోయిన్లకు ఆదరణ ఉండదనే ప్రచారం సినిమా వాళ్లు చేసిందే. నిజానికి ప్రేక్షకులు అలా భావించడం లేదు అన్నది నా చిత్రాల ద్వారా నిరూపణ అయ్యింది. నాకు ముందు కూడా పలువురు హీరోయిన్లు సాధించారు. మరో విషయం ఏమిటంటే నేనీ స్థాయికి ఎదగడానికి విమర్శలే కారణం. అవే మనల్ని ఎదగడానికి దోహదపడతాయి. పలాన పాత్రలో సమంత నటించలేదు అని ఎవరన్నా అంటే దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని అలాంటి పాత్రలో నటించడానికి కఠినంగా శ్రమించడానికి సిద్ధ పడతాను. కాబట్టి విమర్శలే ఎదగడానికి సోపానాలు అని అంటున్న సమంత తాజాగా నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం యూటర్న్, శివకార్తికేయన్‌కు జంటగా నటించిన సీమదురై షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల ఒక వారం గ్యాప్‌లో వరుసగా తెరపైకి రావడానికి ముస్తాబవు తున్నాయి. ఈ రెండు చిత్రాలపైనా అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. వీటిలో ఇటీవల విడుదలైన యూటర్న్‌ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోందన్నది తెలిసిన విషయమే.

మరిన్ని వార్తలు