అప్పుడు చాలా బాధ కలిగింది : సమంత

17 Mar, 2020 17:10 IST|Sakshi

దక్షిణాదిన మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ సమంత. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. ప్రత్యూష ఫౌండేషన్‌ పేరిట ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి సమంత.. హైదరాబాద్ టైమ్స్‌ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌తో సమంత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగచైతన్యతో పెళ్లైన తర్వాత తన వస్త్రధారణకు సంబంధించి ఎదురైన ట్రోలింగ్‌ గురించి వివరించారు. 

ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లైన కొత్తలో నేను సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులను(దుస్తుల గురించి) కొందరు దారుణంగా ట్రోలింగ్‌ చేశారు. ఇది నాకు చాలా బాధ అనిపించింది. నేను రెండోసారి అలాంటి దుస్తులు ధరించిన ఫొటోలను పోస్ట్‌ చేసినప్పుడు ట్రోలింగ్‌ కాస్త తగ్గింది. ఏదైనా తొలి అడుగు వేసేటప్పడే కష్టంగా ఉంటుంది. తొలుత ట్రోలింగ్‌ ఎదుర్కొన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆ సమయంలో ట్రోలింగ్‌ చేసే వారి ఆలోచన మార్చాలని అనుకున్నాను. అందుకోసం నా వంతు చేయగలిగింది నేను చేయబోతున్నాను’ అని తెలిపారు. 

కాగా, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తన ‍ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటారు. అలాగే సామాజిక అంశాలతో పాటు మూగజీవాలకు సంబంధించిన పోస్ట్‌లు కూడా చేస్తుంటారు. 

చదవండి : పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా