పరిపూర్ణం కానట్లే: సమంత  

1 Oct, 2019 11:27 IST|Sakshi

తమ పెంపుడు కుక్క హష్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని లాలిస్తూ స్టార్‌ హీరోయిన్ సమంత మూగజీవాల పట్ల ప్రేమను చాటుకున్నారు. ‘జంతువులను ప్రేమించినంత వరకు... ఏ ఒక్కరి ఆత్మ కూడా పరిపూర్ణం కానట్లే.. స్పందించే హృదయం లేనట్లే’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని ఇంటి కోడలు సామ్‌.. సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సినిమా అప్‌డేట్లతో పాటు కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలో హష్‌ను ముద్దు చేస్తున్న ఫొటోను సమంత సోమవారం తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్‌ చేశారు. ఆరున్నర లక్షలకు పైగా లైకులు సాధించిన ఫొటోపై అక్కినేని అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ అమల బ్లూక్రాస్‌ ద్వారా మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో భాగమయ్యే అక్కినేని కోడలు సమంత కూడా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మూగజీవాలపై ఆమెకు ఉన్న ఈ ప్రేమను ఈ విధంగా ఆవిష్కరించారు’ అంటూ అభినందిస్తున్నారు. కాగా తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో పాటుగా.. కొరియన్‌ మూవీ రీమేక్‌.. ఓ బేబీ సక్సెస్‌తో సామ్ ఫుల్‌ జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Until one has loved an animal , a part of one’s soul remains unawakened

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా