సూపరో సూపరు!

14 Jun, 2018 00:22 IST|Sakshi
సమంత, ‘సూపర్‌ డీలక్స్‌’ యూనిట్‌తో...

రంగమ్మా, మంగమ్మా ... అక్కినేని కోడలు సమంత ఎక్కడమ్మా! మామ నాగార్జున సిల్వర్‌జూబ్లి వెడ్డింగ్‌ యానివర్శరీ సెలబ్రేషన్స్‌లో కనిపించలేదమ్మా! ఇదిగో ఇలాగే ఫ్యాన్స్‌ అందరూ ఫన్నీగా పాడుకుంటున్నారు. కానీ సమంత మాత్రం చెన్నైలో కేక్‌ను ముక్కలు ముక్కలు చేసి పక్కనున్న వాళ్ల నోరు తీపి చేశారు. ఏంటీ? మామయ్య వెడ్డింగ్‌ యానివర్శరీలో పాల్గొనకుండా చెన్నైలో బర్త్‌డే పార్టీకి వెళ్లారా సమంత! అని ఆశ్చర్యపోకండి. ఆమె కేక్‌ కట్‌ చేసింది తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసినందుకు.

బిజీ బిజీ షెడ్యూల్‌ వల్ల మామయ్య పెళ్లి రోజు పార్టీకి సమంత హాజరు కాలేకపోయారని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘అరణ్యకాండం’ ఫేమ్‌ త్యాగరాజన్‌ కుమార్‌రాజా దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సమంత ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేశారు సమంత. ఆ సందర్భంలో సెట్స్‌లో సరదాగా కేక్‌ కట్‌ చేసి, చిత్రబృందంతో సందడి చేశారామె. తమిళ, తెలుగు భాషల్లో ఈ ఏడాది ఆల్రెడీ మూడు సార్లు సిల్వర్‌స్క్రీన్‌పై మెరిసిన సమంత ఈ ఏడాది మరో రెండో సినిమాల్లో కనిపించే అవకాశంఉంది. ఇది తెలిసిన ఫ్యాన్స్‌ మా సమంత... సూపరో సూపరు అంటున్నారు.

మరిన్ని వార్తలు