‘ఓ బేబీ’ని సీక్రెట్‌గా చూసిన సమంత

6 Jul, 2019 20:35 IST|Sakshi

సెలబ్రెటీలు బయట కనిపిస్తే అభిమానులు చేసే హంగామా గురించి తెలిసిందే. అలాంటిది ఓ పెద్ద సినిమా రిలీజైతే అక్కడి థియేటర్‌కు హీరో, హీరోయిన్లు వెళ్లే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్‌గా విడుదలైన ఓ బేబీ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. అయితే ఈ సమయంలో ఓ థియేటర్‌కు సీక్రెట్‌గా వెళ్లి సినిమాను వీక్షించినట్లు సమంత ట్వీట్‌ చేశారు.

తాను ఎవరకీ తెలియకుండా సినిమాను చూశానని సమంత సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.‘ దేవీ థియేటర్‌లో ఓ బేబీ చిత్రాన్ని ఎవరికీ తెలియకుండా చూశాను. సినిమా చేస్తున్న ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన చూడాలంటే ఆ మాత్రం చేయాలి. ఇదే నా స్ఫూర్తి. థాంక్యూ’ అంటూ ట్వీట్‌ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేష్‌, రాజేంద్ర ప్రసాద్‌, లక్ష్మీ, నాగశౌర్య ప్రధాన పాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు