‘పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’

18 Aug, 2018 10:48 IST|Sakshi

‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా టాలెంట్‌ చూపించాడు సంపత్‌ నంది. రచ్చ, బెంగాల్‌ టైగర్‌ సినిమాలతో మాస్‌ డైరెక్టర్‌గా నిరూపించుకున్నాడు. డైరెక్టర్‌గానే గాకుండా నిర్మాతగానూ సక్సెస్‌ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. గతంలో ఆది హీరోగా ‘గాలిపటం’ సినిమాను నిర్మించిన సంపత్‌ నంది...తాజాగా ‘పేపర్‌ బాయ్‌’ ను నిర్మిస్తున్నారు. 

సంతోష్‌ శోభన్‌ (‘వర్షం’ దర్శకుడు శోభన్ తనయుడు‌) హీరోగా నటించిన ‘పేపర్‌ బాయ్‌’ అందంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సంపత్‌ నంది అందించిన కథ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. ‘నాకు పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’, ‘ప్రేమంటే ఆక్సిజన్‌లాంటిది అది కనిపించదు.. కానీ బతికిస్తుంది’ లాంటి డైలాగ్‌లు బాగున్నాయి. భీమ్స్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. సంపత్‌నంది టీమ్‌ వర్క్స్‌పై వస్తోన్న ఈ సినిమాకు జయ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు