ఆగస్ట్ 31న రాబోతోన్న ‘పేపర్ బాయ్’

23 Aug, 2018 19:27 IST|Sakshi

మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది అందించిన కథతో రాబోతోన్న సినిమా పేపర్‌ బాయ్‌. తాజాగా విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్‌తోనే ఆకట్టుకుంటోన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు వినూత్న పద్దతిలో ప్రమోషన్‌ కార్యక్రమాలను చేపట్టింది. 

సంతోష్ శోభన్ హీరోగా, ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా.. సంపత్‌నంది టీమ్‌ వర్క్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల కానున్నట్టు ప్రకటించారు. అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నుండి రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇంటింటికి తిరిగి పేపర్ వేసి అందర్నీ కలవబోతున్నారు. ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు