సంపూ రికార్డ్.. 3 రోజుల్లో రూ.12 కోట్లు!

14 Aug, 2019 09:46 IST|Sakshi

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు, మరోసారి అదే రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. గత శనివారం రిలీజ్‌ అయిన సంపూ సినిమా కొబ్బరిమట్ట మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. పెద్ద హీరోల సినిమాలో పోటి ఉన్నా సంపూ సినిమా కలెక్షన్ల విషయంలో సత్తాచాటటం విశేషం. ఈ సినిమా మూడు రోజుల్లో 12 కోట్ల గ్రాస్‌ సాదించినట్టుగా పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్‌లో తమ మార్క్‌ చూపించారు.

ఆ పోస్టర్‌లో స్టార్‌ మార్క్‌ పెట్టి ఫ్యాన్స్‌ కోసం రూ. 9 కోట్ల ఫేక్‌ కలెక్షన్లు యాడ్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు. అయితే సంపూ సినిమా భారీ పోటి మధ్య మూడు కోట్ల వసూళ్లు సాధిచటం కూడా ఘనవిజయమే అంటున్నారు విశ్లేషకులు. హృదయకాలేయం సినిమా దర్శకుడు సాయి రాజేష్‌ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమాకు రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకుడు. సంపూర్ణేష్‌ బాబు మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా వీక్‌డేస్‌లోనూ స్టడీ కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు