సంపూ సినిమాకు 233 కోట్ల కలెక్షన్లు..

9 May, 2018 12:56 IST|Sakshi

హైదరాబాద్‌: వేటాడే ముందు వెనకడుగేసిన సింహంలా.. కొన్నాళ్లపాటు ప్రచారానికి దూరంగా సంపూర్ణేశ్‌ బాబు మళ్లీ జూలు విదిల్చాడు. బిగ్‌బాస్‌ షో తర్వాత దాదాపు కనిపించకుండాపోయిన ఈ ‘బర్నింగ్‌ స్టార్‌’ .. బాక్సాఫీస్‌ వద్ద సత్తా చూపించాడు. తన తాజ చిత్రం ‘కొబ్బరిమట్ట’  తొలివారం ఏకంగా రూ.233.64 కోట్ల కలెక్లన్లు సాధించాడు. ‘అదేంటి? అసలా సినిమా రిలీజైందా?’  అనేకదా మీ డౌట్‌! నిజమే, సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు చెబితే అతను సంపూ ఎందుకవుతాడు?

బాబుకు బర్త్‌డే గిఫ్ట్‌: ‘హృదయ కాలేయం’తో ప్రేక్షకుల ప్రేమకు సదా బానిసగా మారిన సంపూ.. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలుపెట్టిందే కొబ్బరిమట్ట సినిమా. రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చిన ఈ స్ఫూఫ్‌ యాక్షన్‌ కామెడీని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. బుధవారం సంపూర్ణేశ్‌ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని కొబ్బరిమట్ట యూనిట్‌ కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. అందులో ‘233.64  కోట్లు.. ఫస్ట్‌ వీక్‌ ఎక్స్‌పెక్టెడ్‌ గ్రాస్‌’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు