నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు

30 Sep, 2015 19:51 IST|Sakshi
నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, హీరో సంపూర్ణేష్ బాబు కల ఎట్టకేలకు నెరవేరింది. రాం చరణ్ తేజ హీరోగా నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్ర షూటింగ్ బుధవారం జరుగుతుండగా సెట్స్లోకి మెగా స్టార్ చిరంజీవి  వచ్చాడు. అయితే ఎప్పటి నుంచో చిరూని కలవాలన్న సంపూ కల ఇన్ని రోజులకి నెరవేరింది. ఇంకేముంది వెంటనే చిరుదగ్గరికి వెళ్లి కలిసి ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ చిత్రంలో మోగా స్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్నట్టుగానే ఇప్పుడు కనిపిస్తున్నారని..తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.