ఆ కష్టమేంటో నాకు తెలుసు!

13 Dec, 2017 10:08 IST|Sakshi

తమిళ సినిమా: ఇవాళ తమిళ సినిమా చాలా వరకు యథార్థాలను వెతుక్కుంటూ సక్సెస్‌కు దగ్గరవుతోందనే చెప్పాలి. చరిత్రను తవ్వుకుంటూ అందులో ఆసక్తికర సంఘటనలకు చిత్ర రూపం ఇస్తోంది.అలా తెరకెక్కుతున్న తాజా చిత్రం వాండు. వివిధ విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందిన మహాగాంధీ, షికా, రిషీరిత్విక్, రమ, సాయ్‌దీనా,భువనశ్రీ  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎం.పవర్‌ సినీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. వాసన్‌ షాజీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈయన సెల్వరాఘవన్‌తో పాటు పలువురు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పని చేశారు. ఏఆర్‌.నేశన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శక నటుడు సముద్రకని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి సినీ నేపథ్యంలేకుండా చిత్రాన్ని రూపొందించడం ఎంత కష్టమో తనకు బాగా తెలుసన్నారు. 

వాండు చిత్రాన్ని దర్శకుడు వాసన్‌ షాజీతో పాటు మొత్తం యూనిట్‌ ఎంతో శ్రమించి తెరకెక్కించారని అన్నారు.ఉత్తర చెన్నై భూమి పుత్రులని పేర్కొన్నారు. వారి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ చూస్తుంటే గోలీసోడా చిత్రం గుర్తుకొస్తోందన్నారు. వాండు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సముద్రకని పేర్కొన్నారు. అవకాశాలు మనల్సి వెతుక్కుంటూరావు. మనమే వాటిని కల్పించుకోవాలి అన్న భావనతో చేసిన చిత్రం వాండు అని, ఇది ఉత్తర చెన్నై ప్రజల గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుందని దర్శకుడు వాసన్‌ షాజీ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ అందరూ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు