‘నష్టపరిహారం’ అనే మాటే వద్దు

27 Feb, 2015 02:45 IST|Sakshi
‘నష్టపరిహారం’ అనే మాటే వద్దు

 ఇకపై ఎవరి నోట నష్టపరిహారం అనే మాట రాకూడదని ప్రముఖనటుడు, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. వివరాల్లో కెళితే ఆయన హీరో, విలన్‌గా ద్విపాత్రాభినయం చేసి మ్యాజిక్ ఫ్రేమ్స్, పతాకంపై రాధిక శరత్‌కుమా ర్, స్టీఫెన్ లిస్టిన్‌తో కలిసి నిర్మించిన చిత్రం సండమారుతం. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. దీనికి విశేష ప్రజాదరణ లభించడంతో చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చెన్నైలో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
 
 చిత్ర హీరో, నిర్మాత శరత్‌కుమార్ మాట్లాడుతూ సండమారుతం చిత్రం తన కెరీర్‌లో చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. తాను ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయన్నారు. మరో విష యం ఏమిటంటే సుమారు 20 ఏళ్ల తరువాత ప్రతి నాయకుడిగా నటించిన చిత్రం సండమారుతం అని అన్నారు. మొత్తం మీద చిత్ర యూనిట్ సమిష్టి కృషికి తగినఫలి తం ఈ విజయంగా పేర్కొన్నారు. తదుపరి చిత్రానికి రెడీ అవుతున్న ట్లు త్వరలోనే ఆ వివరాలు వెల్లడించనున్నట్లు శరత్‌కుమార్ అన్నారు.
 
 లాభనష్టాలు సహజం
 ఏ వృత్తిలో నైనా లాభ నష్టాలు సహజమన్నారు. సినిమా అందుకు అతీతం కాదని లాభం వచ్చినప్పుడు మాట్లాడని వారు, నష్టం ఏర్పడితే పరిహారం అడగడం న్యాయం కాదని లింగా చిత్ర వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారు. లింగా చిత్రం సమస్యపై నటీనటుల సంఘం పాత్ర గురించి శరత్‌కుమార్ మాట్లాడుతూ నటుడు రజనీకాంత్ మానవతావాదంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు చెప్పారన్నారు. ఈ విషయం గురించి తాను సంఘ నిర్వాహకులు రాక్‌లైన్ వెంకటేష్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సమస్య ఇంతటితో ఆగిపోవాలని ఇకపై ఎవరూ నష్ట పరిహారం అంటూ అడగకుండా పరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు కలసి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు.