నెక్ట్స్ సూపర్‌ స్టార్‌తోనే!

13 Jul, 2019 12:07 IST|Sakshi

తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. అర్జున్‌ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్‌, ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాను బాలీవుడ్‌లో కబీర్‌సింగ్‌ పేరుతో రీమేక్‌ చేసి మరో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్ ఫీవర్‌ నడుస్తోంది.

ఇక సందీప్ తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతోంది. వరుసగా రెండు సినిమాలతో సెన్సేషన్‌ సృష్టించిన సందీప్‌ తన నెక్ట్స్ సినిమాను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్‌కు కథ వినిపించిన సందీప్‌ ఫైనల్‌ నేరేషన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని సందీప్‌ ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తయిన వెంటనే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు