భాయ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారా?

30 Jun, 2019 02:53 IST|Sakshi

నార్త్‌లో ‘కబీర్‌ సింగ్‌’ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. షాహిద్‌ కపూర్‌కి సోలో హీరోగా ఇది తొలి వంద కోట్ల చిత్రం అవ్వడమే కాకుండా రెండొందల కోట్ల సినిమా కూడా కాబోతోందని టాక్‌. తన సూపర్‌ హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను షాహిద్‌తో ‘కబీర్‌ సింగ్‌’గా హిందీలో రీమేక్‌ చేశారు సందీప్‌ వంగా. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ దిశగా నడుస్తోంది. హిందీకి సౌత్‌ సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో బడా చాన్స్‌ కొట్టేశారట సందీప్‌ వంగా. సల్మాన్‌ హీరోగా టీ సిరీస్‌ సంస్థ నిర్మించబోయే సినిమాకు దర్శకుడిగా సందీప్‌ పేరుని పరిశీలిస్తున్నారట. ‘కబీర్‌ సింగ్‌’కు టీ–సిరీస్‌ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామి అనే సంగతి తెలిసిందే. మరి.. సల్మాన్‌తో సందీప్‌ సినిమా ఉంటుందా? అంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా సంగతి అలా ఉంచితే సందీప్‌ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌కు ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. 

మరిన్ని వార్తలు