వైరల్‌ వీడియో : సంగీత్‌లో కరణ్‌, శిల్పా, అనిల్‌ డ్యాన్స్‌ 

8 May, 2018 10:44 IST|Sakshi

బాలీవుడ్‌ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఎన్నో రూమర్ల అనంతరం సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజాల పెళ్లి నిశ్చయమైంది.  రూమర్లకు చెక్‌పెడుతూ... ఇరువర్గాల కుటుంబాలు మే 8న పెళ్లి జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.  పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్‌ నటి సోనమ్‌, ఆనంద్‌ జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను, సోమవారం సంగీత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

సోనమ్‌ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమాలకు అర్జున్‌ కపూర్‌, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్‌ జోహర్‌తో పాటు సన్నిహితులు, బాలీవుడ్‌ తారలు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు సంగీత్‌ వేడుకలో పలువురు బాలీవుడ్‌ నటులతో పాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొన్నారు. సంగీత్‌ కార్యక్రమంలో కరణ్‌ జోహార్‌, అర్జున్‌ కపూర్‌, శిల్పా శెట్టి చేసిన డ్యాన్స్‌ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరణ్‌ జోహర్‌ డ్యాన్స్‌ చేస్తుండగా... మధ్యలో అనిల్‌ కపూర్‌ రావడం... అనిల్‌ కపూర్‌, శిల్పా శెట్టిని డ్యాన్స్‌ చేయడానికి ఆహ్వానించడం... శిల్పా డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు