కట్‌ చేస్తే...

21 Jan, 2018 03:46 IST|Sakshi

అవును... లాంగ్‌ హెయిర్‌ని కట్‌ చేస్తే బాయ్‌కట్‌ అవుతుంది. గర్ల్స్‌ కొంతమంది ఈ బాయ్‌కట్‌ని ఇష్టపడతారు. హీరోయిన్లయితే ఇష్టం ఉన్నా లేకున్నా క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే హెయిర్‌ కట్‌ చేసేస్తారు. మరి.. సంజనకు బాయ్‌కట్‌ ఇష్టమో లేదో చెప్పలేదు కానీ, పొడవాటి జుత్తుని కత్తిరించేశారు. ఇదంతా తన తాజా సినిమా కోసమే.

ఇప్పటివరకూ కనిపించిన సంజన వేరు.. ఇప్పుడు కనిపించబోతున్న సంజన వేరు అన్నట్లుగా ఈ సినిమాలో ఆమె లుక్‌ ఉంటుందట. బాయ్‌ కట్‌లో ఆమె చాలా అందంగా ఉన్నారు కదూ! (ఇన్‌సెట్‌) ఇంతకీ ఆ సినిమా గురించి కొంచెం చెప్పమ్మా? అంటే.. ‘ఇప్పుడే చెప్పనమ్మా’ అంటున్నారు సంజన. వివరాలన్నీ సీక్రెట్‌గా ఉంచాలని చిత్రబృందం డిసైడ్‌ అయ్యారట.. మరి.. రహస్యం ఎన్నాళ్లు దాగుతుందో చూద్దాం. ఈ మూవీ తన కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోతుందనే నమ్మకంతో సంజన ఉన్నారట.

మరిన్ని వార్తలు